Total Pageviews
Saturday, September 3, 2011
అసమ్మతి తయారీ కార్ఖానా
80 కోట్ల జనాభా సమస్య ఆహార భద్రత విషయంలోను, ఆదివాసీల మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్న ఆపరేషన్ గ్రీన్‌హంట్ విషయాన్ని పట్టించుకోని అన్నాజీ, భారత ప్రజల మెస్సయ్య ఎలా అవుతాడు? తెలంగాణ యువకుల ప్రాణత్యాగాల్ని పట్టించుకోని ఈ దేశ మీడియా, ప్రజల్ని మాస్ హిస్టీరియోకెందుకు ఉసిగొల్పుతోంది? అణచివేయబడుతున్న కులాలు, విద్యార్ధులు, మేధావులు ఆలోచించాలి!
అవినీతికి పాల్పడేవారికే, నీతి గురించి మాట్లాడే అవసరం ఎక్కువగా వుంటుంది. వీళ్ళే 'నీతిని' ఎక్కువగా ప్రేమిస్తారు. ఎందుకంటే 'నీతి' వీళ్ళకి అందని ద్రాక్ష. నిత్యజీవితంలో నీతికి కట్టుబడి ఉండటం వీళ్ళ వృత్తికి, ప్రవృత్తికి వ్యతిరేకం. కనుక సాఫ్ట్ స్కిల్స్, అపర గాంధీగారి ఆచ్ఛాదన ఉన్న హజారేగారిని వెదికి, వేదిక నెక్కించి జాతర జరిపిస్తే జనంలో కలిసిపోవచ్చు అనే ఉపాయానికి అనుగుణంగా, హైటెక్ హంగులతో రామ్‌లీలా మైదానంలో "ది గ్రేట్ ఇండియన్ సర్కస్''ని ప్రారంభించింది.
ఈ సర్కస్‌లో సూత్రధారులు, పాత్రధారులు ఎవరు? దళిత, ఆదివాసీ, ముస్లిమ్, ఒబిసి వ్యతిరేకులు. బాబ్రీ మసీదు కూల్చివేతను, గ్రాహం స్టెయిన్స్ సజీవదహనాన్ని, గుజరాత్ గాయాల్ని, ఖైర్లాంజీ కిరాతకాన్ని, బెల్చి సజీవదహనాల్ని దైవ సమ్మత కార్యాలుగా నిర్వహించిన పవిత్ర సనాతన ధర్మరక్షకులేనన్నది తిరుగులేని వాస్తవం. అయితే అన్నా టీం ప్రశాంత్‌భూషణ్, అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కిరణ్‌బేడీ, స్వామి అగ్నివేష్, బాబా రామ్‌దేవ్, మేధాపాట్కర్లు సనాతన ధర్మరక్షకులు అంటే ఈ లోకం నమ్మదు.. ఎందుకంటే వాళ్ళకున్న బహిర్గత ప్రజామోదం, నాగరికత, పాజిటివ్ థింకింగ్ లాంటి గుణగణాలన్నీ ఇండియన్ మేధావి వర్గాన్నే అబ్బురపరుస్తాయి.
మండల్ కమిషన్‌ను వ్యతిరేకించిన ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్య విద్యార్థులకు ఈ సనాతన ధర్మరక్షకులే ఇన్స్పిరేషన్. అన్నా దీక్షా శిబిరంలో ఆగస్టు 23న జరిగిన రెండు సంఘటనలు ఇందుకు సందర్భ సాక్ష్యంగా నిలుస్తాయి.
అవి (1) అన్నా హజారే దీక్షకు మద్దతు పలుకుతూ, కల్చరల్ ప్రోగ్రాం యివ్వటానికి అక్కడికి చేరిన లిబరేషన్ గ్రూప్‌ని (యం.యల్.పార్టీ) రామ్‌లీలా మైదానం నుండి తరిమేసారు.
(2) అదే దీక్షా శిబిరం నుండి అన్నా మద్దతుదార్లు 'ఆరక్షణ్' సినిమాకి మద్దతుగా, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. ఇంతకన్నా యింకేమి సాక్ష్యం కావాలి, అన్నా టీం అసలు ఉద్దేశాలు, ప్రణాళికలు అర్థం చేసుకోటానికి? అసలు 'అవినీతి' అంటే ఏమిటి? లంచగొండితనమే అవినీతా? రైతు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకి లాభదాయకమైన ధర నిర్ణయించకుండా, గిట్టుబాటు ధర నిర్ణయించటం, పారిశ్రామిక వేత్తకి తన సరకు ధర తాను నిర్ణయించుకునే హక్కునివ్వటం, ప్రభుత్వాల చట్టబద్ధ అవినీతి కాదా? గ్రామ స్వరాజ్యం గురించి మాట్లాడే మన అపర గాంధీగారు తన ప్రాంతంలోని రైతుల ఆత్మహత్యల గురించి ఏనాడైనా రిలే నిరాహార దీక్ష అయినా చేసాడా? అవినీతి పెరిగిపోతున్నమాట వాస్తవం.
దానికి కారణమైన దోపిడీని, ఒక కల్చర్‌గా, కళగా అభివృద్ధి చేసిందెవరు? చాతుర్వర్ణ వ్యవస్థలో అగ్రభాగాన ఉన్న ప్రాబల్య కులాలు కాదా? వేల, లక్షల కోట్ల అవినీతికి పాల్పడే మైనింగ్ మాఫియాని, రాజకీయ కుబేరుల్ని, 10 రూపాయలు లంచం తీసుకొనే ట్రాఫిక్ కానిస్టేబుల్ని అవినీతిలో ఒకేగాటన కట్టటంలో ఉన్న నీతి ఎంత? అన్నా హజారే బృందానికి, సంఘ్ పరివార్ గ్రీన్ రూమ్ ఆపరేటర్స్‌కి 'అవినీతి' అనే తేలికపాటి ఆయుధం ఎందుకు అవసరమొచ్చింది? మల్టీనేషన్ కంపెనీలకు ఈ శతాబ్ధారంభంలో వరల్డ్ సోషల్ ఫోరమ్‌ని ఆరంభించవలసిన ఆగత్యమెందుకొచ్చిందో, ఈ దేశంలోని దోపిడి పాలక కులాలకు "అవినీతి వ్యతిరేక పోరాటమనే'' ఆయుధం అందుకే అవసరమొచ్చింది.
ప్రపంచీకరణకు ప్రత్యామ్నాయం లేదన్న మార్కెట్ వేదాన్ని, నినాదంగా మార్చినవాళ్ళే మార్కెట్ శక్తుల్ని ఎదుర్కొంటామని నమ్మబలికి ప్రపంచ సామాజిక వేదిక (వరల్డ్ సోషల్ ఫోరమ్) 21వ శతాబ్దారంభంలో ఏర్పాటు చేశారు. అది సగటు ఆశావాదికి సగటు ఆనందాన్ని కలిగించింది. 2004లో హైద్రాబాద్ (ఇండియా) ప్రపంచ సామాజిక వేదిక జరిపిన రెండు రోజుల సదస్సులో ఏఏ శక్తుల్ని ముందుంచి, ఏఏ శక్తులు వెనకుండి నడిపాయో, అర్ధమయ్యే నాటికి అవాక్కయ్యింది బాధ్యతాయుత పౌరసమాజం.
ప్రపంచీకరణ, సరళీకరణ మూడవదశలో చేరేందుకు సన్నద్ధమౌతున్న ప్రస్తుత తరుణంలో వరల్డ్‌బ్యాంక్, ఐ.యం.యఫ్ లాంటి పెట్టుబడిదారీ సంస్థలకు ఎన్జీవోల వంటి 'సమ్మతి తయారీ ఫ్యాక్టరీలు' అణగారిన జనాన్ని ఆశించినంతగా ప్రభావితం చేయలేకపోతున్నాయని గుర్తించారు. కొత్త ఫార్ములా వెదికారు. ఆ ఫార్ములానే మైఖేల్ చోసుదొ వస్కీ నిర్వచించిన మ్యానుఫాక్చరింగ్ డిసెంట్ (అసమ్మతి తయారీ) సిద్ధాంతం.
అంటే విద్యార్థులు తమ న్యాయమైన డిమాండ్ల కొరకు శాంతియుత ఊరేగింపులు తీస్తుంటే ప్రభుత్వ పెద్దలే అందులో చేరి వారికి నాయకత్వం వహిస్తున్నట్లు నటించి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలిస్తూ చివరకు ఆ ఉద్యమాన్ని నీరుగార్చటం; 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని మర్రి చెన్నారెడ్డి వంటి వారు, హైజాక్ చేసి చివరకు పదవులు తీసుకొని ఉద్యమాన్ని చల్లార్చటం; రాజకీయ పార్టీలు, ఎస్.సి.సెల్, బి.సి. సెల్, ఎస్.టి. సెల్, మైనారిటీ సెల్ పెట్టి ఆయావర్గాల్లో వస్తున్న చైతన్యానికి అడ్డుకట్ట వేయించే కుతంత్రాలకి పాల్పడటం; దోపిడికి గురయ్యే వర్గాల తరపున దోపిడికి పాల్పడే వర్గాలు ముందుగానే దోపిడీకి వ్యతిరేకంగా ఊరేగింపులు, ధర్నాలు, నిరాహార దీక్షలు చేయటం ప్రారంభించి కంటితుడుపు చట్టాల్ని, అగ్రిమెంట్లని చేసి అసలు సమస్యను పక్కదోవ పట్టిస్తారు.
ఈ రోజు 'అవినీతి' అనే అంశాన్ని అందరూ అసహ్యించుకొనే స్థాయికి పెంచింది వీళ్ళే. దాన్నే ఆయుధంగా మార్చుకొని, అన్నా హజారే లాంటి గాంధేయ వాదిని రాలేగాంసిద్ధి గ్రామ జమ్మిచెట్టు నుండి దించి రాంలీలా మైదానంలో ప్రదర్శనకి పెట్టారు. 600 మందికి పైగా తెలంగాణ విద్యార్ధి యువకులు చనిపోతున్నా నోరెత్తని అన్నాజీ, ఖైర్లాంజీ కిరాతకాన్ని పట్టించుకోని గాంధేయుడు, అరుంధతీరాయ్ అన్నట్లు, మైనింగ్ మాఫియా గురించి గాని, సెజ్‌ల గురించి గానీ, గ్రీన్ హంట్‌లో ఆదివాసీల్ని అంతంచేస్తున్నపుడుగాని, సింగూర్, నందిగ్రాం ఉద్యమాలనుగాని, పోలవరం, నర్మదా డ్యాంలకు వ్యతిరేకంగా ప్రజాందోళనల్నిగాని పట్టించుకోని అన్నాజీ, రాలేగాం సిద్ధి చుట్టుపక్కల గ్రామాల్లో అందరి ఇళ్లలో సావర్కర్, ఫోటోలను పెట్టించే విప్లవాత్మక కార్యక్రమాన్ని, అమలుచేస్తూ అపర సంఘపరివార్ అనధికార సుప్రీంలా భారత రాజకీయ చిత్రపటం మీదికి అదాటుగా ఎలా వచ్చాడనేది అంత రహస్యమేమి కాదు.
జనలోక్‌పాల్ బిల్లు గురించి ప్రధానమంత్రిని బిల్లులో ఉంచాలా లేదా అన్నది అసలు సమస్యేనా? ఈ రోజు పి.యం.ఓ., సి.యం.ఓ., పార్లమెంటుని కూడా ప్రభావితం చేయగలిగే శక్తి కార్పొరేట్ సంస్థలకున్నదన్న విషయం అన్నాజీకి ఆయన భజన బృందానికి తెలియదా? భారత్‌లోనే మినీ భారత్‌లను సృష్టించుకుని, చట్టాల కతీతంగా దోపిడీ కొనసాగిస్తూ, అణు ఒప్పందంలో ప్రతిపక్ష పార్లమెంట్ సభ్యులకు ఒక్కొక్కరికి 30-40 కోట్ల రూపాయలు లంచంగా యిచ్చి ఇండియాని అమెరికాకు తాకట్టు పెట్టే బిల్లును నెగ్గించుకున్నప్పుడు అంత మొత్తం డబ్బుని ఏఏ కార్పొరేట్ శక్తులు సమకూర్చాయో ఈ గాంధేయ రుషికి తెలియదా? కిరణ్‌బేడి బెహన్జీకి, అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కార్పొరేట్ డాక్టర్ ట్రెహన్లకు తెలియదా?
అన్నింటికన్నా ముఖ్యమైన రెండు విషయాలు ఆలోచించాల్సినవి.
(1) రెండు నెలల క్రితమే రామ్‌లీలా మైదానంలో సెప్టెంబర్ 1వ తారీకున బామ్సెఫ్ (బ్యాక్వర్డ్ అండ్ మైనారిటీ ఎంప్లాయీస్ ఫెడరేషన్), ఒబిసి జనాభా లెక్కల విషయంలో జరుగుతున్న జాప్యానికి వ్యతిరేకంగా పెద్ద ర్యాలీని తలపెట్టి ప్రభుత్వ అనుమతి పొందింది. అదే రామ్‌లీలా మైదానాన్ని, అన్నాకు సెప్టెంబర్ 3 వరకు ప్రభుత్వం ఎందుకు అప్పగించింది? ఒబిసి సెన్సస్ విషయంలో అన్నా టీం స్పందన ఏమిటి?
(2) రామ్‌లీలా మైదానంలో రిజర్వేషన్ వ్యతిరేక నినాదాలు ఎందుకు, ఎవరిచ్చారు? గుజరాత్లో ముస్లిములను ఊచకోత కోసినపుడు మాట్లాడని అన్నాబృందం, మండల్ కమిషన్ని వ్యతిరేకించిన ఆధునిక మనువాదులు, వేదాంత, పోస్కోలాంటి మల్టీనేషన్ మైనింగ్ మాఫియాని వ్యతిరేకించని మినీభారత్ నిర్మాతలు, 'అవినీతి' అనే అంశాన్ని తీసుకొని కాషాయ కూటమికి అనుకూలంగా, మైనార్టీలకు వ్యతిరేకంగా ఒక సైన్యాన్ని ఎందుకు తయారుచేస్తున్నట్లు? రాజ్యాంగేతర వ్యవస్థని ఎందుకు కోరుతున్నట్లు? 80 కోట్ల జనాభా సమస్య ఆహార భద్రత విషయంలోను, ఆదివాసీల మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్న ఆపరేషన్ గ్రీన్‌హంట్ విషయాన్ని పట్టించుకోని అన్నాజీ, భారత ప్రజల మెస్సయ్య ఎలా అవుతాడు? తెలంగాణ యువకుల ప్రాణత్యాగాల్ని పట్టించుకోని ఈ దేశ మీడి యా, ప్రజల్ని మాస్ హిస్టీరీయోకెందుకు ఉసిగొల్పుతోంది.
అణచివేయబడుతున్న కులాలు, విద్యార్ధులు, మేధావులు ఆలోచించాలి!
అన్నాటీం ఈ అంశాలకు జవాబు చెప్పాల్సి ఉంది. (1) దేశంలో అవినీతికి పాల్పడుతున్నది ఏఏ వర్ణాలు / కులాలు? (2) స్విస్‌బ్యాంకుల్లో లక్షల కోట్ల రూపాయలు దాచింది ఏఏ కులవర్గాలు? (3) నూటికి 90 శాతంగా ఉన్న శ్రామిక కులాలు అవినీతికి బాధ్యులా? లేక నూటికి 10 శాతంగా కూడాలేని దోపిడీ కులాలు అవినీతికి బాధ్యులా? (4) తమ చుట్టూ ఉన్న కార్పొరేట్ మీడియా, కార్పొరేట్ సంస్థలు, రాజకీయ నాయకులు అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొనటానికి అర్హులేనా? (5) మండల్ కమిషన్‌కి వ్యతిరేకంగా రిజర్వేషన్లకి వ్యతిరేకంగా నినదించిన ఈ గొంతులే కదా దొంగ, దొంగ అని అరుస్తున్నది. (6) ఒక అవినీతి సామ్రాజ్యానికి వ్యతిరేకంగా, యింకో అవినీతి సామ్రాట్టు నినదించటంలోని రహస్యం అసలైన అవినీతి పరులు బయట పడకుండా ఉంచటానికేనా? అడాల్ఫ్ హిట్లర్ తాను యుద్ధంలో ఓడిపోతున్న విషయం రూఢి అయిన తర్వాత ఆత్మహత్యకు సిద్ధం అవుతాడు.
ఆ చివరి క్షణాలలో ఇంగ్లాండ్ ప్రీమియర్‌కు, అమెరికన్ ప్రెసిడెంట్‌కు ఒక వర్తమానం పంపుతాడు. ఆ వర్తమాన మేమంటే "నేను మీకు (పెట్టుబడి దారులకు) చేసే చివరి సేవ ఒక్కటే! మీరు ఇప్పటికైనా యుద్ధంలో చురుకుగా పాల్గొని కమ్యూనిస్టుల నుండి యూరప్‌ను రక్షించండి''. అన్నాజీ! 74 సంవత్సరాల వయస్సులో కూడా నమ్మిన మనువాద గాంధీ సిద్ధాంతానికి అంకితమై ప్రాణత్యాగానికి సిద్ధమైన మీ దీక్షా దక్షతలకు జోహార్లు! మీ వెన్నంటి ఉన్న అపర కుబేరులకు జేజేలు!! మీ దీక్షా దక్షతలను కనీసం 100 కోట్ల పౌరులకు బట్వాడా చేసిన కార్పొరేట్ మీడియాకు వేల వేల దండాలు!!!
- డా.యం.యఫ్. గోపీనాథ్

Sunday, May 15, 2011
హంతకుడెవరు? - డా.యం.ఎఫ్.గోపినాథ్
"ఈదేశానికింత చెడ్డ పేరు రావటానికి కారణం మీరా మేమా? ఆలోచించుకోండి. ఒకప్పుడిది మంచి దేశమని లోకానికి తెలుసు. మళ్ళీ దీనికి మంచి పేరు రావాలి. ఇంత అపఖ్యాతికి కారణం ఎవరు? - టటాంకా యెటాంకా, రెడ్ ఇండియన్స్ నాయకుడు పంజాబ్‌లో అకాలీద ళ్ని బలహీన పర్చటానికి నెహ్రూ కాలం నుంచి అనేక ప్రయత్నాలు జరిగాయి. 1980 ప్రథమార్ధంలో ఇందిరాగాంధీ అకాలీదళ్ కంటిని సిక్కుల కత్తితో పొడవటానికి భింద్రన్‌వాలేని బలోపేతం చేశారు.
1984లో భింద్రన్‌వాలే అమృత్‌సర్‌లోని స్వర్ణాలయాన్ని ఆయుధాగారంగా మార్చివేశాడు. ఇందిరా గాంధీ విజ్ఞప్తులు, ఆదేశాలనుఖాతర్ చేయలేదు. దీంతో అతనికి వ్యతిరేకంగా ఇందిర ''ఆపరేషన్ బ్లూస్టార్'' నిర్వహించారు. ఆ సైనిక చర్యలో భింద్రన్‌వాలే హతమయ్యారు. తిరిగి భింద్రన్‌వాలే శక్తి ఇందిరని హతమార్చింది. గల్లీల్లో గూండాలను తయారుచేస్తుందని, మాఫియా గ్యాంగుల్ని పెంచి పోషిస్తుందని తమ కనుకూలంగా పనిచేస్తే ఫ్రీడమ్ ఫైటర్స్ అని, వాళ్ళే విభేదిస్తే టెర్రరిస్టులుగా నామాంతరం చెందుతారని, ఎంతటి నీచానికైనా దోపిడి పాలక వర్గాలు పాల్పడతాయనే విషయాన్ని ఇందిరాగాంధీ నిరూపించారు.
1979లో సోవియట్ సైన్యాలు అఫ్ఘానిస్తాన్‌ను ఆక్రమించాయి. రష్యన్లకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్న అఫ్ఘాన్ ముజాహిద్దీన్లకు అమెరికా సహాయం చేయటం మొదలుపెట్టింది. ఫ్యూడల్ దొరలు ఒక్కోసారి గొప్పలు పోవడానికి, తమపేరు శాశ్వతంగా నిలబడడానికి ఉదారంగా సహాయం చేస్తారు. కానీ పెట్టుబడిదారుడు ఎట్టి పరిస్థితుల్లోనూ లాభం లేకుండా సహాయం చేయడు. అమెరికా లాంటి విధ్వంసక కాపిటలిజం చేసిన రహస్య సహాయం 300 కోట్ల డాలర్లు.
అంటే 15,000 కోట్ల రూపాయలు. ఈ విషయాన్ని ధ్రువీకరించింది. అఫ్ఘానిస్తాన్‌లో అప్పుడు సి.ఐ.ఎ ఫీల్డ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న మిల్టన్ బియార్డన్ ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. రష్యన్లకు వ్యతిరేకంగా, 3 బిలియన్ డాలర్ల సహాయం అందించే ఉదార స్వభావం అమెరికా పెట్టబడిదారుల కెందుకుంది? కత్రినా సైక్లోన్‌లో తిండి దొరక్క తంటాలు పడ్డ న్యూఆర్లియన్స్ ప్రాంత అమెరికన్ పౌరులకే రొట్టె ముక్కలు కూడా ఉచితంగా అందివ్వని అమెరికన్ పాలకవర్గం అంత పెద్ద మొత్తాన్ని అఫ్ఘాన్‌లో పోరాడుతున్న ముజాహిద్దీన్లకు ఎందుకు ఖర్చు పెట్టినట్టు? ఒసామాబిన్ లాడెన్ అపుడు అఫ్ఘాన్ల తరపున అఫ్ఘానిస్తాన్ లోనే పోరాడుతున్నాడు! ఒసామాని అఫ్ఘాన్ ప్రజలు 'పవిత్ర మానవుడు' అని పిలుచుకుంటున్నారు.
ఆ 3 బిలియన్ డాలర్లు ఒసామాకి అందజేయలేదని, 'ఆ రహస్య సహాయాన్ని' ఒసామా అందుకోలేదని చరిత్రలో సాక్ష్యాలు దొరకుతాయా? ఈ రోజు కాకపోతే రేపైనా! సరే, ఒసామా గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. మహ్మద్ అపద్ బిన్ లాడెన్ అనే యెమన్ దేశస్థుడుకి ఎలియా ఘానెమ్ అనే సిరియా దేశస్థురాలికి 1957, మార్చి 10న సౌది అరేబియాలోని రియాద్‌లో పుట్టిన ఏకైక సంతానం ఒసామా. సముద్రతీరంలోని పోర్టులో కూలీ పనిచేసిన అపద్ బిన్ లాడెన్ సౌదీకి వచ్చి మక్కా మదీనాలకు మరమ్మత్తు, సౌదీ రాయల్ ప్యాలేసులను అతి తక్కువ ఖర్చుతో కట్టి, సౌదీ రాజ కుటుంబాలకు అతి సన్నిహితంగానే కాదు, సౌదీ రాజరిక వ్యవస్థలో మంత్రిగా కూడా పనిచేసాడు.
సౌదీలోనే అతిపెద్ద నిర్మాణరంగ కంపెనీకి అధిపతి అయి, అతికొద్దిమంది ధనికుల్లో ఒకడైనాడు. ఒసామాకి రెండు సంవత్సరాల వయస్సున్నపుడే తల్లిదండ్రులు విడిపోయారు. ప్రఖ్యాతిగాంచిన అల్ ధాగర్ మోడల్ స్కూలులో చదువు. ఆ తరువాత ఇంజనీరింగ్ చేసిన ఒసామా ప్యూర్ ఇస్లామ్‌కి (సౌభ్రాతృత్వానికి) విధేయుడుగా పెరిగాడు. 14 సంవత్సరాల వయస్సులోనే ఖురాన్ మత గ్రంధాన్ని కంఠస్తం చేసి, లైఫ్స్టైల్లో, డ్రెస్‌కోడ్‌లో మహమ్మద్ ప్రవక్తని అనుకరించిన మితభాషి.
స్కూల్లో, కాలేజీలో అవుట్ స్టాండి ంగ్ విద్యార్థిగా పేరు పొందాడు ఒసామా. తన తండ్రి వ్యాపార లావాదేవీల కారణంగా, ఆయన ప్రతి సంవత్సరం ఆర్గనైజ్ చేసే హాజ్ యాత్రల వలన కూడా అరబ్ ప్రపంచంలోని ధనికులతో, ఇస్లామిక్ స్కాలర్స్తోనూ ఒసామాకి పరిచయాలేర్పడ్డాయి. మితభాషి, ఇస్లామిక్ నియమనిష్ఠలతో పెనవేసికొని పోయిన ఈ బక్క పల్చటి వ్యాపారస్తుడిని 1979లో అఫ్ఘానిస్తాన్‌లోకి దూసుకు వచ్చిన రష్యన్ సోషల్ ఫాసిస్ట్ సేనల దుశ్చర్యలకు బలైపోతున్న తోటి అఫ్ఘాన్ ముస్లిమ్ ప్రజల కష్టాలు, కన్నీళ్ళు కదిలించి వేసాయి.
అదే సమయంలో తోటి ముస్లిమ్ సహోదరులకు సాయం చేయమని సౌదీ రాజుల్ని అర్ధించి, విఫలమవుతున్న క్రమంలో శవాల్ని పీక్కుతినే రాబందులుగా ఎదురుచూస్తున్న అమెరికా ( తన జాతీయ జెండాలో రాబందు (ఈగిల్)నే సింబాలిక్‌గా పెట్టుకుంది!) రహస్య పోలీస్ (సిఐఏ , నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ ద్వారా) అఫ్ఘాన్‌లోని తిరుగుబాటుదారులకి 'రహస్య సహాయంగా 3 బిలియన్ డార్లని అందించటానికి తయారుగా కాచుక్కూచుంది.
ముల్లా ఒమర్ నాయకత్వంలోని ముజాహిద్దీన్లకి ఈ రహస్య సహాయాన్ని అందించిందని, అప్పుడే ఎదుగుతున్న, పెరుగుతున్న ఒసామా బిన్ లాడెన్ గురించి అమెరికన్ గూఢాచారులకు, వాళ్ళ వాషింగ్టన్ బాస్‌లకు తెలియదని, ప్రపంచ రాజకీయ పరిజ్ఞానం కొంచెమైనా ఉన్న వాళ్ళకు అర్థం కాదనటం పిల్లి పాలు త్రాగుతూ... అన్నట్లుంటుంది. ఈ విషాయాన్ని సి.ఐ.ఎ. ఆఫీసర్ మిల్టన్ బియార్డాన్ ధ్రువీకరించాడు కూడా.అఫ్ఘాన్ యుద్ధ శరణార్థులకు సౌదీ రాజులు సహాయం నిరాకరించిన తర్వాత చాలామంది ఉలేమాలు (ఇస్లామిక్ స్కాలర్స్) ఒసామా సహాయ ప్రతిపాదనలను అంగీకరించి, మద్దతు పలికారు.
అఫ్ఘాన్ ముస్లిమ్ అనాధల కొరకు రక్షణ వలయాన్ని, సౌదీ, సూడాన్, ఈజిప్ట్ తదితర దేశాల ముజాహిద్దీన్లతో ఏర్పర్చాడు ఒసామా. 1989లో రష్యన్ సైన్యాలు అఫ్ఘానిస్తాన్ నుండి వైదొలగిన తరువాత యుద్ధ భూమిలో ఒసామా అనుభవాలు, తన వ్యాపారాలను లక్ష్య పెట్టక అసలైన ఇస్లామ్‌లోని సౌభ్రాత ృత్వానికి (బ్రదర్హుడ్)కి అంకితమయ్యాడు. పిల్లికి పిల్లికి మధ్య పోరుపెట్టిన.. చందంగా అంతర్జాతీయ వ్యవహారాల్లో అమెరికా అవలంబిస్తున్న నీతి మాలిన దౌత్యాన్ని అర్థం చేసికొన్నాడు. అమెరికా పట్ల, ద్వేషం పెంచుకున్నాడు.
పది సంవత్సరాలు కొనసాగిన ఇరాన్-ఇరాక్ యుద్ధంలోను, పాకిస్తాన్లో ఉగ్రవాదాన్ని పెంచిపోషించటంలోను, లాటిన్ అమెరికన్ దేశాల్లో ప్రజాద్రోహుల్ని తమ కీలు బొమ్మలుగా ప్రతిష్ఠించి, ఆయా దేశాల్లోని సహజ సంపదల్ని దోచుకొని, జాక్ లండన్ తన "ఉక్కుపాదం'' పుస్తకంలో వివరించినట్లు, అమెరికన్ కార్మికులకి అధిక మొత్తంగా జీతాలు చెల్లిస్తూ ప్రపంచ దేశ ప్రజల్ని తన పాదాక్రాంతం చేసికొనే ప్రణాళికలో ఇదంతా భాగమేనని ఒసామా అర్థం చేసుకున్నట్లు కనిపిస్తుంది.
అమెరికన్ పాలకులు 1990 నుంచి ఒక వింతైన సిద్ధాంతాన్ని ప్రచారంలో పెట్టారు. 'మేము (అమెరికా) ప్రపంచంలో ఎక్కడైనా, ఏ దేశాన్నైనా ప్రజాస్వామ్యం ముసుగులో దోచుకునే అర్హత మాకు ఉన్నది. మాకు మద్దతిచ్చే దేశాలు మాకు మిత్రులు, కాదన్నవాళ్ళు ఉగ్రవాదులు'' అనేదే ఆ సిద్ధాంతం. ఇదీ అమెరికన్ ఇంపీరియల్ టెర్రరిస్టుల అంతర్జాతీయ దౌత్యనీతి. ఇది ఎలా ఉన్నదంటే ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం, ఆ రాష్ట్ర ప్రజలకి ఒక స్పష్టమైన తాఖీదులిచ్చింది.
"ఉంటే సల్వాజుడుంలో సభ్యులుగా ఉండండి. లేదంటే మీరంతా మావోయిస్టులే. కాబట్టి మీరు చంపబడడానికి, రేప్ చేయబడడానికి మీ గూడేలు, గుడిసెలు తగలబెట్టబడటానికి అర్హత పొందుతారు'' అన్నది. మాకు బతకటానికి స్వేచ్ఛ కావాలనే ప్రతి ఒక్కడు, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి, టెర్రరిస్ట్గానో, మావోయిస్టుగానో కనపడతాడు. కాషాయ వస్త్రధారుడైన స్వామి అగ్నివేష్ కూడా ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి మావోయిస్టుగానే కనపడినందు వల్లనే ఆయన మీద దాడి జరగడం గమనించాలి.
రష్యన్లు అఫ్ఘానిస్తాన్‌పై చేసిన దాడిని సాకుగా తీసుకొని అమెరికన్ గూఢచారి వ్యవస్థ "ఆపరేషన్ సైక్లోన్'' పేరుతో అఫ్ఘాన్ తిరుగుబాటుదారులకి 3 బిలియన్ డాలర్ల రహస్య నిధిని ఏర్పాటు చేసింది. అప్పటికే అఫ్ఘాన్ నాయకుల మీద నమ్మకం సడలిన ఒసామా తన పవిత్ర యుద్ధాన్ని (జిహాద్) ప్రారంభించాడు. అప్పుడు అమెరికన్ గూఢచారి వ్యవస్థలు (సి.ఐ.ఎ., అమెరికన్ నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీలు) ఒసామా లాంటి కాబోయే ప్రపంచ ఉగ్రవాదిని వదులుకుంటాయా? ఇందిరాగాంధీ భింద్రన్‌వాలేని ఒదులుకోనట్లు, అమెరికా 1980లో ఒసామాకి కావల్సినంత సహాయం చేసి, రష్యన్ సైన్యాలు 1989లో అఫ్ఘానిస్తాన్‌ని వదిలిన తర్వాత గల్ఫ్‌లోని ఇరాక్, కువైట్ ప్రాంతాల్లోని చమురు నిక్షేపాల్ని దోచుకోవటానికి ఉపయోగించుకుందామనుకుంది.
ఒకవైపున ఇజ్రాయేల్‌ని ముస్లిమ్ దేశాలపైకి ఉసిగొల్పుతూ, మరోవైపు సౌదీ అరేబియా రాజరిక వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకుని, ఇరాక్‌లో సద్దాంని శిక్షించటానికి ఒసామాని ఉపయోగించుకుందామనుకుంది అమెరికా. కానీ ఒసామా అమెరికాని ధిక్కరించాడు. అఫ్ఘాన్‌లో 1982-89 వరకు ముజాహిద్దీన్లకు సహాయపడ్డ ఒసామా 1986లో తన పర్యవేక్షణలో పనిచేసే జిహాద్‌ని ప్రార ంభించాడు. 1988 నాటికి అల్‌ఖైదా, అంటే 'ది బేస్' అనే అంతర్జాతీయ జిహాది సంస్థను ఏర్పర్చాడు.
అఫ్ఘానిస్తాన్ నుంచి సోవియట్ సైన్యాలు వైదొలిగిన తరువాత సౌదీకి ఒబామా వెళ్తే అమెరికన్ పాలకుల ఆదేశాల మేరకు సౌదీ రాజరిక వ్యవస్థ ఒసామాని హౌజ్ అరెస్ట్ చేసి, అతని అంతర్జాతీయ ప్రయాణాల్ని నిషేధించింది. అతని జిహాద్లో ఎక్కువమంది సౌదీ అనేబియన్లు, ఈజిప్షియన్లు, యెమెన్, లిబియా, సూడానీయులు, అఫ్ఘాన్లు, పాకిస్తానీయులు, కాశ్మీరీలు, ఇండియన్లు ఉన్నారు.
ప్రపంచవ్యాప్తంగా అత్యంత హింసాత్మక సంఘటలకు పాల్పడుతుంది అమెరికానే అని 40 సంవత్సరాల క్రితమే నల్లజాతీయుల నేత మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అమెరికా గడ్డ మీదనే నిలబడి నిలదీశాడు. రూజ్వెల్ట్, కెనడీ, జిమ్మి కార్టర్ నుంచి రోనాల్డ్ రీగన్, జార్జిబుష్ సీనియర్, బిల్ క్లింటన్, బుష్ జూనియర్, యిపుడు ఒబామా, ఎవరైతేనేమి ఒక్కొక్కడు మహా హంతకుడనే విషయాన్ని చరిత్ర రికార్డు చేస్తూనే ఉంది. అనేక వందల వేల యుద్ధాల్ని చూచిన ప్రపంచ ప్రజల చరిత్ర ఇప్పుడు ప్రశ్నిస్తుంది.
హంతకులెవరు? నరహంతకులు ధరాధిపతులైన వేళ గౌతమ బుద్ధులకి, ఏసుక్రీస్తులకి స్థానమెక్కడ ఉంటుంది? అణిచివేత నుంచి నిరాశ, నిరాశ నుంచి నిరసన, నిరసన నుంచి ధిక్కారం, ధిక్కారానికీ దిక్కు లేకపోతే.. ? టెర్రరిజమే దిక్కవతుందన్నది గతి తర్కం. ఒసామా విషయంలో హంతకుడు ఒక నామవాచకాన్ని మాత్రమే రూపుమాపాడు; ఆ హతుడు సర్వనామమనే విషయాన్ని విస్మరించాడు. ఇది చాలు హంతక అమెరికాకు మరో భంగపాటు సమీప భవిష్యత్తులో కలగటానికి..
Tuesday, March 29, 2011
Monday, March 21, 2011
INVITATION
Date: 21-Nov-2010; Time 10 am to 6 pm; Venue: Hall No. 1, New Academic Block, EFL- University
It is the time to think and probe seriously in to the issue of caste in understanding the nature and scope of the social and political system in India. Observing and experiencing the conflicting interests in the emerging political demands, we the Organizers feel the necessity to debate a day long Discussion on “Caste and its Role in Indian Social Transformation”
We are inviting speakers from different social and political backgrounds (Social activists, Thinkers and academicians) to present papers and debate this issue seriously, to come out with a critical analysis regarding the origin of caste and its consequences in Indian Social, economic, political and cultural spheres.
Organized by:
TSA EFL University and Phule-Ambedakar National Institute of Social sciences & Movements
Organizing Committee:
Dr. M. F. Gopinath MD; DM (Cardiologist)
Kotesh Devulapally PhD (Translation Studies)
Gurram Seetaramulu PhD (Translation Studies)
Sunday, March 20, 2011
Monday, November 8, 2010
దళిత మేధావులు - వామపక్ష మేధావులు-2
ఆ సభలో ఒక ఆర్.ఎస్.యు. రాష్ర్ట కార్య నిర్వాహక కమిటీ సభ్యు డు ‘రిజర్వేషన్లపట్ల మీ అభిప్రాయం ఏమిటి’ అని ప్రశ్నించాడు. ‘రిజర్వేషన్లని సపో ర్టు చేయనివారు కమ్యూనిస్టులు అనుకోవటం లేదు’ అన్నాను. ఈ అభిప్రాయం మీదా లేక ఆర్.ఎస్.యు.దా? అన్నాడా సభ్యుడు. ‘ఆర్.ఎస్.యు. జనరల్ సెక్రెట రీగా ఈ విషయం చెబుతున్నాను. నా ఈ అభిప్రాయాన్ని ఆర్.ఎస్.యు. స్వంతం చేసికొంటే ఆర్.ఎస్.యు.అభిప్రాయం అవుతుంది,లేదంటే నా అభిప్రాయం అవుతుంది’ అన్నాను.అపుడు చర్చ తెగేదాకా లాగవద్దనే సలహామేరకు చర్చ ఆపుచేసాము.
కమ్యూనిస్టు పార్టీల్ని (పార్లమెంటరీ), విప్లవ పార్టీల్ని నడిపించే నాయకత్వాల్లో ఆయా పార్టీలకు అనుబంధంగా ఉన్న మేధావి వర్గం, ఈ దేశ వాస్తవ సామాజిక జీవితాన్ని సరిగ్గా అంచనా వేసి, కనీసం 1990 నుండి ‘కులాన్ని’ గుర్తించినటై్లనా- 1930 నుండి గుర్తించ గలిగినట్లయితే, దోపిడీ కులాల పునాది నుండి వచ్చిన వామపక్ష మేధావుల పట్ల దళిత మేధావుల స్పందన సానుకూలంగా ఉండేదేమో! ఇకనైనా వీరు నిర్వహించవలసిన దిక్సూచి పాత్రనుండి (వ్యాన్‌గార్డ్) తప్పుకొని అనుకరణ స్థాయికి దిగిన వైనాన్ని విశ్లేషించుకోవాలి. మొదట కుల సమస్య లేదన్న వాళ్ళు, తరువాత కుల సమస్య కేవలం మానసిక ప్రవృత్తి, అంటే ‘కులం ఉందనుకుంటే ఉంది, లేదనుకుంటే లేదు’ అన్నారు.
‘కులం కేవలం ఉపరితల సమస్యే, పునాది కాదు’ అన్నారు. ఆ తరువాత- ‘కులం’ అనేది పునాది, ఉపరితలం రెండూ’ అన్నారు. భారత దేశం అంటే ‘కులం’, ‘మనవాడు’, ‘మనోడేనా’ అనే స్పష్టమైన విభజన కనిపిస్తుంటే, 90 సంవత్సరాల నుండి ‘తప్పించుకు తిరుగువాడు ధన్యుడన్నట్లు’ వామపక్షాలు ప్రవర్తిస్తుంటే ఏమనుకోవాలి? 2010 అక్టోబర్ 25న ప్రఖ్యాత మార్క్సిస్టు చరిత్ర కారుడు విక్టర్ కీర్నన్ సంస్మరణార్థం బ్రిటన్‌లోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో నిర్వహించిన లెసన్స్ ఆఫ్ ఎంపైర్ (సామ్రాజ్య పాఠాలు) సదస్సులో ప్రసంగిస్తూ సి.పి.ఎం.
పార్టీ జాతీయ కార్యదర్శి ‘కులం గురించి పట్టించుకోక పోవడం కమ్యూనిస్టుల చారిత్రక తప్పిదం’ అన్నవాడు- 24 గంటలు దాటక ముందే నిన్నటి మాటను దాటవేశాడు. వీళ్ళలో మార్క్సిజం కన్నా మనువాదం పాలు ఎక్కువ ఉందనుకోవడంలో దళిత మేధావుల తప్పుందా? కులం ప్రాముఖ్యత గురించి నాకు అర్థమైనంత వరకు వామపక్ష నాయకత్వానికి, మేధావులకి అర్థం కాక కాదు. వారి కుల దోపిడీకి గురై, అడుగడుగునా అడ్డంకుల్ని దాటుకొని, విద్యావంతులమై, అతి కష్టం మీద సంపాదించుకున్న అనుభవజ్ఞానాన్ని, మాతో కలిసి పనిచేసిన, చేస్తున్న వ్యక్తుల, సంస్థల ఉద్యమాల, ప్రతికూల పరిసర ప్రభావాల ఫలితంగా, మాకొచ్చిన అంచనాల ఫలితమే, మా అభిప్రాయం.
అణచివేతకు గురైన కులాలకు, నేడు ఈ మాత్రమైనా బతుకు భరోసా ఉందంటే, మూడు సంస్థల కృషి ఫలితమని 1991 అక్టోబర్ 1న ఖమ్మంలో ప్రభుత్వం నిర్వహించిన ఖమ్మం జిల్లా ఆవిర్భావ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ప్రకటించాను. అవి- క్రిస్టియానిటీ (అంటరాని వాళ్ళతో కరచాలనం, దేవుడిని చూప నిరాకరణకు గురైన వాళ్ళకి ప్రత్యామ్నయ దేవుడిని చూపించడం), బి. ఆర్. అంబేడ్కర్(జ్ఞాన సముపార్జనకు మార్గాన్ని చూపాడు), వామపక్ష విప్లవ సంస్థలు (ప్రశ్నించి, ఎదిరించి నిలబడే ధైర్యాన్నిచ్చాయి).
ఫూలే- వామపక్ష మేధావులు: బాబా సాహెబ్ అంబేడ్కర్‌ని బ్రిటిష్ ఏజెంటన్న మార్క్సిస్టు మేధావులు మహాత్మా ఫూలేని ఎందుకు విస్మరించారు? రాజారామ్ మోహన్ రాయ్‌ని, కందుకూరి వీరేశలింగం పంతుల్ని, గురజాడ అప్పారావుని, గాంధీని, నెహ్రూని చివరకు ఎమర్జెన్సీ విధించి పౌరహక్కుల్ని హరించిన ఇందిరా గాంధీని కూడ పొగిడిన వామపక్ష మేధావులు, నాయకులు ఫూలేను గురించి, కనీసం చర్చలోకి కూడ ఎందుకు తీసికొని రాలేదు? విదేశీయులైన రోజలిండ్ ఓ హాలన్, గెయిల్ ఓంవెత్‌ల పరిశోధనల మూలంగా, బహుజన సమాజ్ పార్టీ, బహుజనులు నడిపిన ‘నలుపు’ పత్రిక ద్వారానే తెలుగు నాట ఫూలే గురించి, ఆయన నడిపిన పోరాటాల గురించి, బ్రాహ్మణిజం విష సంసృ్కతి గురించి దేశానికి తెలిసింది కాని, ఏ ఒక్క మార్క్సిస్టు నాయకుడు, మేధావి ఈ పనికి పూనుకున్నాడా? ఈ వ్యతిరేకతను ఏమనాలి?
ఈ దేశంలో మార్స్కిజం మనువాదానికి, బ్రాహ్మణిజానికి దాసోహమన్నదనాలా, మార్క్సిజం ముసుగేసుకున్న మనువాదం- మార్క్సిజాన్ని మింగేసిందనాలా? భారత దేశ చరిత్ర, స్వాతంత్య్ర ఉద్యమాలు, హేతువాదం, భౌతికవాదం- ఇలా అనేక విషయాల మీద ఉపన్యాసాలిచ్చే వీరు ఫూలే గురించి మాట్లాడలేదెందుకు? వామపక్ష మేధావులు డి.డి. కోశాంబి, బిపిన్ చంద్ర, రాహుల్ సాంకృత్యాయన్, ఆర్.ఎస్. శర్మ- వీరెవరికి ఫూలే గురించి తెలి యదనుకోవాలా? ఆంధ్ర రాష్ర్టంలోని, చరిత్రకారులు, విప్లవ కవులు, మేధావుల దృష్టిలో ఫూలే పోరాటాలు అభివృద్ధినిరోధక పోరాటాలా? బ్రాహ్మణిజంలో నిశ్శబ్ద హత్యే ఒక ఆయుధం.ఈ సైలెంట్‌కిల్లింగ్‌లో వామపక్ష మేధావులు భాగస్వాములై నారనటానికి ఫూలేఉదంతం ఒక సాక్ష్యం. ఇందుకు కారణం ఫూలే బ్రాహ్మణిజాన్ని, వేదాల్ని, వాటి ప్రమాణాల్ని,వాటి క్రిమినల్ మనస్త త్వాన్ని బట్టబయలు చేశాడు. అందుకే ఈ హిందూ కమ్యూనిస్టు మేధావులకి ఫూలే అంటే అంత కక్ష.
అంబేడ్కర్- వామపక్ష మేధావులు: సాధారణంగా వ్యక్తులపట్ల, సంస్థలపట్ల తప్పుడు నిర్ణయాలు చేసేవాళ్ళకి ఎక్కువ కారణాలు తెలిసి ఉండాలి. కానీ అంబేడ్కర్‌ని- కుల వ్యవస్థ, దాని ఆవిర్భావం, కొనసాగింపుకు దోహదపడే అంశా ల్ని పరిశీలించటంలో వామపక్ష మేధావులకి గాని, వామపక్ష పార్టీలకిగాని సరైన అవగాహనకి రావడానికి అవసరమైన సమాచారం కోసం ప్రయత్నించినట్లు లేదు. ఒక వ్యక్తి, ‘పుట్టుక తోటే ప్రతిభావంతుడు’ అనే సిద్దాంతాన్ని మార్క్సిజం కాని న్యూరో సైన్సెస్ కాని ఒప్పుకోవు. అదేవిధంగా ‘వైరుధ్యాలు’ తెలిసికొని, పరిష్కరించడంలో మావో ఆలోచనను గాని, మావోయిజాన్ని గాని అవగాహన చేసికొన్నవాడైతే, ‘లెనిన్ ఇండియాలో పుడితే గాంథీ అయ్యేవాడని, గాంథీ రష్యాలో పుడితే లెనిన్ అయ్యేవాడనే నిర్ణయానికి,భగవత్గీతలో మార్క్సిజం ఉంది’ అనే తప్పుడు నిర్ణయాలకి కమ్యూనిస్టు పార్టీ అగ్ర నాయకుడు శ్రీపాద అమృత డాంగే రాడు.
మద్రాసు రాష్ర్టంలో, దేశ వ్యాప్తంగా బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాలను (ఉదా:పెరియార్, నారాయణ గురు, అంబేడ్కర్) బ్రాహ్మణ నాయకత్వానికి వ్యతిరేకంగాను, వారి ఎదుగుదలను ఓర్వలేకనే బ్రాహ్మణే తరులు నిర్వహిస్తున్న ఉద్యమాలుగా ను డాంగే చిత్రీకరించారు. ఈ దేశ మూల వాసుల తిరుగుబాట్లు, చార్వాక, బౌద్ధ తాత్త్విక విచారణలు, ఉద్యమాల గురించి గాని, తద్విరుద్ధమైన రామాయణ, భారత, భగవత్ గీతల్లోని శ్రామిక కులాల వ్యతిరేక తాత్త్విక ఆలోచన్లను గురించి గాని వీరు ఏనాడు శాస్త్రీయంగా విశ్లేషించి చర్చించలేదు.
సి.పి.ఎం. పార్టీ సీనియర్ నాయకుడు, కేరళ రాష్ర్ట వామపక్ష పార్టీ ప్రథమ ముఖ్యమంత్రి ఇ.ఎమ్.ఎస్. నంబూద్రి పాద్‌కు అంబేడ్కర్ పట్ల ఎంత తిర స్కార, వ్యతిరేక భావం ఉందంటే- తను రాసిన ‘భారత స్వాతంత్య్ర పోరాట చరిత్ర’ అనే పుస్తకంలోని 773 పేజీల్లో కనీసం రౌండ్ టేబుల్ సమావేశాల్లో గాని, రాజ్యాం గ పరిషత్తులో గానీ అంబేడ్కర్ ప్రసక్తి లేకుండా, రాకుండా జాగ్రత్త పడ్డారు. వైస్రా య్ కౌన్సిల్లో, అంబేడ్కర్ సభ్యునిగా చేరినందుకు సామ్రాజ్యవాదుల ఏజెంట్ అని, విప్లవ ద్రోహి అని నిందించారు అప్పటి కమ్యూనిస్టు నాయకులు.
అంబేడ్కర్ ఉద్య మాన్ని వామపక్ష నాయకులు, మేధావులు, చరిత్రకారులు కూడా ‘జాతీయోద్య మాన్ని బలహీన పరిచే చీలిక ఉద్యమంగా, ప్రమాదకరమైన బ్రిటిష్ అనుకూల ఉద్యమం’(భారతదేశ స్వాతంత్రోద్యమం 1857-1947, బిపిన్ చంద్ర పాల్ (1989)గా చిత్రించారు. అంబేడ్కర్ విషయంలో ఇప్పటికీ పార్లమెంటరీ కమ్యూ నిస్టు పార్టీల నుండి విప్లవ కమ్యూనిస్టు పార్టీల వరకు వేస్తున్న అంచనాలు దోపిడీ కుల కంపు కొడుతున్నాయి.
ఆ కంపుని దాచుకొనే ప్రయత్నమే వీరు తగిలిం చుకున్న మార్స్కిజం బురఖా. వీరు వల్లించే ‘సోషలిజం’ వీరి ‘కులం పెట్టుబడికి’ ఒక రక్షణ కవచం. అంబేడ్కర్ సిద్ధాంతం, ఆచరణ, ఉద్యమాల గురించి హిందూ కమ్యూనిస్టుల అభిప్రాయాలు చూడండి: 1976-77 ల్లో సి. పి. ఐ. (ఎం. ఎల్) వినోద్ మిశ్రా గ్రూప్ ఒక డాక్యుమెంట్‌ను మూర్తి అనే ఆంధ్రా నాయకుడి ద్వారా ఉస్మానియా మెడికల్ కాలేజీలోని వామపక్ష విద్యార్థుల్లో అంబేడ్కర్ మీద చర్చకు పెట్టారు. అందులో అంబేడ్కర్ కులతత్వవాది అనీ, బ్రిటిష్ ఏజంట్ అనీ రాశారు.
దళిత మేధావులు - వామపక్ష మేధావులు -3
ఇక సి.పి.ఐ(యం.యల్) న్యూ డెమెక్రసీ గురించి. 270 గిరిజన గూడేలు మునిగి పోతాయని, లక్షలాది గిరిజనుల బతుకులు బజారున పడతాయని, పర్యావరణం దెబ్బ తింటుందని ప్రజలందరూ చాటినా, పోలవరం కట్టవలసిందే అని వ్యాసాలు రాసి, ప్రస్తుతం కొన ఊపిరితో ఉన్న తమ పార్టీని రక్షించుకోడానికి ప్రత్యేక తెలం గాణ నినాద ఆర్తనాదాన్ని వినిపిస్తున్న వీరి సిద్ధాంత కర్త వేములపల్లి వెంకట్రా మయ్య ‘భారతదేశంలో కుల వ్యవస్థ, భిన్న దృక్పధాలు అన్న తన పుస్తకంలో అంబేడ్కర్ గురించి తనకుల దురహంకార జ్ఞానాన్ని ఈ క్రింది విధంగా బయట పెట్టుకున్నాడు.1. శ్రమ విభజన వల్ల కులాలు ఏర్పడ్డాయి. 2. కుల వ్యవస్థకు ఫ్యూడల్ వ్యవస్థ పునాదిగా కొనసాగుతున్నది.
‘కులాల ఆవిర్భావం కొనసా గింపునకు శ్రమ విభజన కారణం’అని వీరు నమ్మి, నమ్మించిన సిద్ధాంతం ఒక మచ్చుతునక. ప్రపంచ ప్రజల చరిత్ర, భారత దేశ ప్రజల చరిత్ర, వారి వారి జీవన విధానాలు తెలియని ఇలాంటి వాళ్ళు విప్లవాలు తీసికొస్తారట! ఈ దేశంలోని కుల వ్యవస్థ లాభ, నష్టాలను, అంటే ఏ కులాలు లాభ పడతాయి, ఏ ఏ కులాలు నష్టపోతాయి అన్న విషయాన్ని స్పష్టంగా అర్థం చేసికొన్న వాళ్ళు ముగ్గురు. వారు: జోతి రావ్ ఫూలే, అంబేద్కర్, గాంధీ. కుల వ్యవస్థ వల్ల భారత దేశం అన్ని రంగాల్లో వెనుకబడి పోయిందని జోతిరావ్ ఫూలే, అంబేడ్కర్లు వివరిస్తే, కుల వ్యవస్థే హిందూ మతానికి ప్రాణం అని గాంధీ వాదించారు.
వేముల పల్లి ప్రకారం కుల వ్యవస్థకి ఫ్యూడల్ వ్యవస్థ పునాదట! కుల సంసృ్కతి ఫ్యూడల్ సంసృ్కతిలో భాగమట! కానీ కుల వ్యవస్థ ఏర్పాడటానికి ప్రధాన కారణం బలప్రయోగం, అంటే యుద్ధం. కిరాతక పరాయి ఆర్య తెగలకు ఈ దేశ మూలవాసులకు ఆహార సేకరణ దశ అంతరించి ఆహార ఉత్పత్తి దశ ప్రారంభకాలంలో జరిగిన గణ యుద్ధాలు. ఆ యుద్ధాల్లో పోరాడిన నాటి దస్యులే నేటి అంటరాని కులాలు. ఆ గణ యుద్ధాల్లో చనిపోయిన మూలవాసుల యుద్ధ వీరులే నరకుడు, జరాసంధుడు, మహీషుడు, వాలి, రావణ, బలి చక్రవర్తులు. యుద్ధ పిపాసులైన దోపిడీ దొంగలే ఇంద్రుడు, బ్రహ్మ, విష్ణు, రాముడు, కృష్ణుడు. మాతృ భూమికై పోరాడిన వాళ్ళను రాక్షసులని, మహర్లని (మహా= భయంకరమైన, హరి= శతృవు), అంటరాని వాళ్ళని ముద్ర వేశారు.
యుద్ధంలో ఓడిపోయిన యుద్ధ ఖైదీల సంతతికి నీచమైన వృత్తుల్ని అంట గట్టి వెలివేసారు. యుద్ధంలో గెలిచిన ఆర్యుల వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేయడా నికి యుద్ధ ఖైదీల సంతతిని, బానిసలుగా, ఏ హక్కులు లేకుండా చేశారు. రాబోయే తరాలు చరిత్ర తెలిసికొని తిరగబడకుండా దేవతలు, రాక్షసులని, కులాల్ని దేవుడు సృష్టించాడనే కట్టు కథలల్లారని, వీళ్ళ కట్టుకథల్ని చదవితే వాస్తవాలు బయటపడ్తాయనే భయంతో వీళ్ళు చదవకూడదనే ఆంక్ష విధించారనేది వాస్తవం. అందుకే, కులాల ఏర్పాడడానికి కారణం శ్రమ విభజన కాదు. కామ్రేడ్స్ అవగాహన తప్పు. వారు ఇప్పటి వరకు తెలిసి నమ్మినా, తెలియక నమ్మినా అది నేరపూరిత సిద్ధాంతం.
వేములపల్లి వెంకట్రామయ్య రాసిన ‘భారత దేశంలో కులవ్యవస్థ భిన్న దృక్పథాలు’ అన్న తన పుస్తకంలో అంబేడ్కర్‌ను కోట్ చేసూ తేల్చిన అబద్ధాల చిట్టా ఎలా ఉందంటే, ‘అవకాశవాద జారుడు బండ మీద అడ్డంగా నిలబ్టెబడ్డ చెంబు’లా ఉంది. అయితే రంగనాయకమ్మ, వేములపల్లి వెంకట్రామయ్య అంబేడ్కర్ మీద రాసిన పుస్తకాలు, వాటిలో వారి కుల దురహంకారం ఒకే విధంగా ఉంది. రంగనాయకమ్మ రాసిన ‘బుద్ధుడు చాలడు, అంబేడ్కర్ చాలడు’ అనే పుస్తకానికి జవాబులు ఇప్పటికే వచ్చేశాయి. వేములపల్లి వెంకట్రామయ్యకు ఒక ప్రశ్న!
‘భారత దేశంలో ఫ్యూడల్ వ్యవస్థతోనే కులాలు ప్రారంభమయ్యాయా? లేక ఫ్యూడలిజం ఒక వ్యవస్థగా రూపుదిద్దుకోకముందే భారత దేశంలో కులాలు ఏర్పడ్డాయా? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి. పై విషయాలు పరిశీలించినట్లయితే, ‘‘అంబేడ్కర్- ఆరుగురు గుడ్డి వాళ్ళు’ సామెత చెప్పుకోవచ్చు. తమ ప్రాణాలను తృణప్రాయంగా ప్రజల కొరకు అర్పిస్తున్న అప్పటి పీపుల్స్ వార్ పార్టీ కూడా అంబేడ్కర్‌ని ‘లిబరల్ బూర్జువా’ గా ముద్రవేయడం!
ఉదాహరణకు చేతబడి, బాణామతి విషయాన్నే తీసుకుందాం. చేతబడి చేసేది ఏ కులాలవారు, చేతబడి వలన చనిపోయేది ఏ కులాలవారు? చేతబడి చేశారని పండ్లు ఊడకొట్టించుకున్నది, సజీవ దహనానికి గురి అయినది ఏ కులాలవారు? ఈ విషయం మీదనే 2006 ఫిబ్రవరి 11 న మంగళగిరి చార్వాక ఆశ్రమంలో అక్కడ చేరిన మేధావులను ‘క్షుద్ర విద్యలకి మూల గ్రంథం అధర్వణ వేదం కదా! (అధర్వణ=చేతబడి=బ్లాక్ మ్యాజిక్). రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలన్ని చదివేది బ్రాహ్మణ వర్గం కదా! మరి చరిత్రలో ఏనాడైనా ఒక్క బ్రాహ్మణుణ- చేతబడి చేశాడని పండ్లూడగొట్టిన సందర్భంగాని, సజీవ దహనం చేసిన సందర్భం కానీ చూపించగలరా? చదువురాని శ్రామిక కులాల వాళ్ళు మంత్రాలెట్లా పెడతారు?’ అని అడిగాను. సమాధానం రాలేదు.
మొన్ననే నల్లగొండ జిల్లా, చౌటుప్పల్ మండలంలోని కైతాపూర్ గ్రామంలో, దోపిడీ కులాల పెత్తందార్లకు ఎదురు తిరిగినందుకు గుద్గేటి యల్లయ్య అనే దళిత నాయకుణ్ణి, అతనితో పాటు మరో కుమ్మరి కులస్థుణ్ణి చేతబడి పేరుతో సజీవ దహనం చేసిన సంఘటన కళ్ళముందే మెదులుతున్నది. అంటే శ్రామిక కులాల అణచివేతలో భాగంగానే బాణామతి, చాతబడి వంటి ఆయుధాల్ని ఉపయోగిస్తున్నారన్న విషయం కూడా ఈ మేధావులు బయట పెట్టలేదంటే వీరి సాంసృ్కతిక విప్లవ సైనికులు ఏం చేస్తున్నట్లు? ఇలాంటి ప్రశ్నలకు జవాబు ఇవ్వకుండా తప్పించుకొనే కాలం అంతరించి పోయింది.
భారతదేశ చరిత్రలో విలన్లుగా, రాక్షసులుగా ముద్ర పడ్డ నరక మహారాజు, మహీష చక్రవర్తి, బక మహారాజు, రాజా జరాసంధ, రావణ, బలి చక్రవర్తుల జయంతులు, వర్థంతులు జరపడానికి మా సాంసృ్కతిక సైనికదళాలు సిద్ధమవుతున్నాయి. ఫాసిస్ట్ బ్రాహ్మణీయ హిందూ సంసృ్కతికి వ్యతిరేకమైన ఈ దేశ అసలైన ప్రజా సంసృ్కతిని ప్రతిష్ఠిస్తాం.బి.ఆర్.అంబేడ్కర్ పట్ల వామపక్ష మేధావుల, ఉద్యమకారుల అభిప్రాయాలను, వారి రాతలను చదివిన తరువాత దళిత మేధావులు ఏ విధంగా స్పందించాలని కోరుకుంటారు? గాంధీని పొగిడిన కమ్యూనిస్టులు, నెహ్రూలో, ఇందిరా గాంథీలో సోషలిజాన్ని చూచిన కమ్యూనిస్టులు కందుకూరిని రాజా రామ్ మోహన్ రాయ్‌ని (బ్రాహ్మణ వితంతు వివాహాల సంస్కరణ ఉద్యమకారులు).
శ్రీశ్రీ (మార్క్సిజానికే వ్యతిరేకి అయిన ఓ మేధావి)ని భుజాన వేసుకొని ఊరేగుతున్న వామపక్ష మేధావుల గురించి దళితులు ఏ అవగాహనకు రావాలనుకుంటున్నారు? తమ కులంలోని కుళ్ళునే కొంత మేరకు కడుక్కోవాలని ప్రయత్నించినవారి పట్ల, అభివృద్ధి నిరోధకుడైన గాంథీ పట్ల, గోడమీద పిల్లి సోషలిసు,్ట తెలంగాణ సాయుధ పోరాటాన్ని రక్తపుటేరుల్లో ముంచిన నెహ్రూ పట్ల, హిట్లర్ వారసురాలు ఇందిరా గాంథీని పొగిడిన ఎస్.ఎ. డాంగే పట్ల, ఉదారంగా వ్యవహరించిన వామపక్ష మేధావులు అంబేడ్కర్‌ని ఎందుకు రకరకాల ముద్రలు వేస్తున్నారనే సందేహం రావటం సహజం! కారంచేడు, చుండూరు సంఘటనలు జరిగినపుడు స్పందించని విప్లవ ‘కుల’ కలాలు రాసే చెత్తను, నెత్తికెత్తుకోవాలా?
విప్లవం, విముక్తి కొందరికి ఆదర్శమయితే ‘మాకు అది అవసరం’. బహుళజాతి సంస్థల విషపుత్రికలైన ఎన్జీఓలను, అమెరికా సామ్రాజ్యవాదాన్ని నెత్తికెత్తుకుని ఊరేగే దళిత మేధావులున్నట్లే, పాలక కులాల అధికారుల అభయ హస్తం అందుకుంటూ, విప్లవకారుల ‘మరణవార్త’ని లోకానికి తెలియజేయటమే విప్లవ కార్యక్రమమని భ్రమింపజేసే మాయా మేధావులపట్ల అప్రమత్తంగా ఉండాలి.నిజాయితీ, నియమాలకు కట్టుబడే దళిత మేధావులు, ఈ దుష్ట సమాజాన్ని సమూలంగా మార్చాలని అనుకునే వామపక్ష మేధావులు- అంటే ఇరుపక్షాలు సంక్లిష్టమైన భారతీయ సమాజాన్ని వాస్తవ దృష్టితో అవగాహన చేసికోటానికి ప్రయత్నించాలి.
Friday, August 20, 2010
Friday, August 13, 2010
మార్క్సిజం ముసుగులో కుల రాజకీయం
మార్క్స్ అదృష్టవంతుడు. అంబేద్కర్ దురదృష్టవంతుడు. మార్క్స్‌కు ఏంగెల్స్ వంటి మిత్రుడు, లెనిన్, స్టాలిన్, మావో వంటి సైద్ధాంతిక, తాత్విక, రాజకీయ వారసులు ఉన్నారు. ఆయన ప్రతిపాదించిన వర్గ నిర్మూలనా సిద్ధాంతాన్ని వారు అభివృద్ధి చేశారు; మార్క్సిజం అజేయమని నిరూపించారు. అంబేద్కర్ ప్రతిపాదించిన కుల నిర్మూలనా సిద్ధాంతాన్ని అభివృద్ధి చేయడం అటుంచి, అవగాహ న చేసుకొన్నవాళ్ళే కరువయ్యారు. ఏప్రిల్ 14, డిసెంబర్ 6 భజంత్రీలు మాత్రమే ఉన్నా రు.
అంబేద్కర్‌ని అర్థం చేసుకొన్న వాళ్ళ కన్నా, అపార్థం చేసుకొన్న వాళ్ళే ఎక్కువ. దేశవ్యాప్తంగా రెండు రకాల నేరాలు చట్టబద్ధంగా జరుగుతున్నాయి. ఒకటి-అనాది గా అంటరానికులాలపై జరుగుతున్న ఊరు బహిష్కరణలు, హత్యలు, అత్యాచారాలు; రెండు-జలియన్‌వాలాబాగ్; భగత్ సింగ్, భూమయ్య, కిష్టాగౌడ్‌ల ఉరితీత; ఆదిభట్ల కైలాసం, వెంపటావు సత్యం నుంచి చెరుకూరి రాజ్‌కుమార్ (ఆజాద్) ఎన్కౌంటర్ వర కు జరిగిన చట్టబద్ధ (!) హత్యలు.
ఈ నేరాలు ఈ దేశ మూల వాసుల్ని అణచివేసి, వారి ధన, మాన ప్రాణాల్ని దోచుకోవటానికి క్రీ.పూ. 2500 నుంచి పరాయి ఆటవిక ఆర్య తెగలు సాగిస్తున్న దండయాత్ర, దమనకాండలో భాగమే అని కొంచెం లోతుగా పరిశీలిస్తే అర్థమవుతుంది. నాటి సుగ్రీవుడి లాంటి చిదంబరం, హనుమంతుడి లాంటి మహేంద్రకర్మ, అంగదుడులాంటి రమణ్‌సింగ్‌లు వర్తమాన ఆర్యులకు దొరికి నప్పుడు మూలవాసుల (ఆదివాసీ, ఎస్సి, బిసి, మైనారిటీల) బతుకులకు భద్రత ఎక్కడ ఉంటుంది?
భారతదేశంపై ఆర్యుల దండయాత్రలో మూడు దశలు ఉన్నాయి. మొదటి దశలో సింధు నాగరకతను ధ్వంసం చేశారు. ఆ తరువాత తమలో తాము కలహించుకొంటూ నే (కురుక్షేత్ర సమరం ఇందుకొక ఉదాహరణ) నరకుడు, బకుడు, జరాసంధుడు మొదలైన మూల వాసుల రాజులను సంహరించారు. రెండో దశలో రాముడు, శంభూకుడు, వాలి, రావణులను సుగ్రీవుడు, విభీషణుడు లాంటి కోవర్ట్స్ సహాయంతో సంహరించా రు. ఇక మూడవ దశ వర్తమాన కాలానిది.
ఈ దశలో మధ్య భారతం మీద ఆర్య-ద్రావిడ సంయోగ చిహ్నమైన చిదంబరం నాయకత్వంలో అణచివేయబడ్డ జాతులకు అండగా నిలిచిన ఆజాద్ లాంటి వారిని హతమారుస్తున్నారు. ఈ దండయాత్రను తిప్పికొట్టవలసిన శక్తులు ఐక్యంగా కదలవలసిన సమయమిది. తాత్వికరంగంలో రామాయణ, భారత కట్టుకథల్ని మూల వాసుల కోణం నుంచి పరిశీలించవలసి ఉన్న ది.
చరిత్రలో దాచబడ్డ వాస్తవాలను వెదికి తీయవలసి ఉంది. ఈ కోణం నుంచి ఆలోచిస్తేనే కారంచేడు మాదిగల, చుండూరు మాలల, ఖైర్లాంజి మాంగ్ల హత్యాకాండను అర్థం చేసుకోగలుగుతాం. అణచివేతకు గురైన కులాల సమస్యల్ని వామపక్షాలు అర్థం చేసుకోవలసివుంది. పెట్టుబడిదారీ వ్యవస్థని, సామ్రాజ్యవాదాన్ని మూలవాసుల నాయకత్వం అర్థం చేసుకోవాలి. కాని జరుగుతోన్న, నడుస్తోన్న ఉద్యమాల చరిత్ర ఇందుకు భిన్నంగా, వ్యతిరేకంగా చోటుచేసుకొంటోంది.
వర్గం ప్రధానమని, కులం అప్రధానమనేది మన వామపక్ష మేధావుల సునిశ్చిత విశ్వాసంగా ఉంది. 1936లో 'ఇండియన్ లేబర్ ఫ్రంట్'ని ప్రారంభించిన సందర్భంగా అంబేద్కర్ చెప్పిన 'అశేష భారత ప్రజలకు బ్రాహ్మణిజం, పెట్టుబడిదారీ విధానం మధ్య ఉన్న వైరుధ్యాలే ప్రధానమన్న' సూచనను అప్పటి, యిప్పటి వామపక్షీయులు పట్టించుకోడం లేదు.
కంచికచర్ల, కారంచేడు, పదిరికుప్పం, నీరుకొండ, చీమకుర్తి, చుం డూరు, వేంపెంట, తిమ్మ సముద్రం, ప్యాపిలి, కీల్వణ్ మణి, బెల్చి, ఖైర్లాంజి ఘటనలు కేవలం వర్గ వైరుధ్యాల ఫలితమని నమ్మాలా? నా అనుభవంలోని ఒక వింత సంఘటనను పేర్కొంటాను. జస్టిస్ పున్నయ్య కమిషన్ ఖమ్మం వచ్చినప్పుడు జరిగిన ఒక సమావేశంలో కమ్యూనిస్టు పార్టీ వారు నన్ను ప్రాంభోపన్యాసం చేయమన్నారు.
నా ప్రసంగంలో ఒక వాస్తవాన్ని ప్రస్తావించాను. 'ఆనరబుల్ జస్టిస్, మీరు ఖమ్మం జిల్లాలో కుల వివక్ష గురించి పరిశీలించే క్రమంలో ఆల్ ఈజ్ వెల్ వితిన్ ఖమ్మం అనిపిస్తుంది. రెండు గ్లాసుల పద్ధతి కొరకు వెదికితే నిరాశ మిగులుతుంది. ఖమ్మం కేంద్రంగా 50 కిలో మీటర్ల రేడియస్‌లో భూముల రికార్డులు పరిశీలించండి. యాభై ఏళ్ల క్రితం దళితులపేరు మీద ఉన్న ఇనామ్ భూములు ప్రస్తుతం ఈ కమ్యూనిస్టు పార్టీల నాయకుల ఆధీనంలో ఉన్నాయి.
ఫలానా గ్రామంలో మాదిగలకు చెందిన 140 ఎకరాల భూమి ఇప్పుడు ఆ ఊరి కమ్యూనిస్టు నేత చేతిలో ఉంది! ఇలా చాలా గ్రామాలపేర్లు ప్రస్తావిం చి మాకు ఈరోజు అగ్రకులాల గ్లాసుల్లో నీళ్ళు, చాయ్ త్రాగాలనే కోరిక ఏ మాత్రం లేదు. రాజ్యాంగ విరుద్ధంగా దళితుల ఇనామ్ భూముల్ని, సారా తాపించి, ఆ కుటుంబంలో తల్లీ బిడ్డలకు తెలియకుండా కొనడం నేరం. కమ్యూనిస్టులమనుకునే వాళ్ళు అసలే ఈ పనులు చేయకూడద'ని అన్నాను. ఏ పార్టీ అయితే ఆ సమావేశాన్ని ఏర్పాటు చేసిందో ఆ పార్టీ నాయకత్వమే ఆ సమావేశాన్ని బాయ్‌కాట్ చేపింది!
తెలంగాణ సాయుధ పోరాటకాలంలో నల్లగొండ జిల్లా హుజూర్నగర్ ప్రాంత దళ కమాండర్ (ఒక అగ్ర కులస్తుడు) భూస్వాముల భూమిని పంచుతూ తన కులస్తుల భూమి పంపకాన్ని వాయిదా వేశాడు. ఆ దళంలోని ఎస్సి, బిసి వర్గాలకు చెందిన సభ్యులు భూపంపకంలో కుల సమస్య గురించి పార్టీ ప్రావిన్షియల్ కమిటీకి ఒక లేఖ రాశారు. సర్ ఆర్థర్ కాటన్ 1850ల్లో గోదావరి, కృష్ణాదులపై బ్యారేజీల నిర్మాణాన్ని పూర్తిచేసిన తరువాత ఉభయ గోదావరి, కృష్ణా గుంటూరు జిల్లాల్లో చిన్న, మధ్య తరగతి రైతులుగా ఉన్న ఒక సామాజికవర్గం వారు 1930 నాటికి పీజెంట్ బూర్జువాలుగా అభివృద్ధి చెందారు.
నిడుబ్రోలులో ఎన్జి రంగా స్థాపించిన రైతు శిక్షణాలయంలో తెలంగాణలోని నీటి వనరుల గురించి, సారవంతమైన భూముల గురించి సమాచారం తెలుసుకొని తెలంగాణను దోచుకోవడానికి బాటలు వేశారు. ఆంధ్ర వలసల్ని సాఫీగా సాగించడానికి ఈ పీజెంట్ బూర్జువాలకు 'విశాలాంధ్రలో ప్రజారాజ్యం' అనే కుట్రపూరిత నినాదం తోడ్పడింది.
తదనంతర కాలంలో ఈ పీజెంట్ బూర్జువాలే సోవియట్ యూనియన్, తూర్పు యూరోప్ కమ్యూనిస్టు దేశాలకు వరిధాన్యం, పొగాకు ఎగుమతులు ప్రారంభించారు. 1970ల్లో మాదాల నారాయణస్వామి నాయకత్వంలో సిపిఐ (ఎంఎల్) పార్టీ ఒకటి ఉనికిలోకి వచ్చిన తరువాత గుంటూరు పొగాకు కమ్యూనిస్టు చైనాకు ఎగుమతవడం ప్రాంభమయింది.
ఏతా వాతా తెలంగాణప్రాంత శ్రామిక కులా ల శ్రమ పెట్టుబడిని కోస్తా జిల్లాల అగ్రకుల కమ్యూనిస్టు నాయకత్వం బాగా ఉపయోగించుకొంది. ఆ శ్రామిక కులాల వారి త్యాగాలను తమ కులాల నుంచి అభివృద్ధి చెం దిన పీజెంట్ బూర్జువాల ప్రయోజనాలను కాపాడడానికి ఉపయోగించుకున్నారు, ఉపయోగించుకుంటున్నారు. రైతు సంఘాలను, రైతు కూలీల సంఘాలను, ఫ్యాక్టరీ యజమానుల సంఘాలను, ఆ ఫ్యాక్టరీలలో పనిచేసే కార్మిక సంఘాలను కమ్యూనిస్టు పార్టీ లే నిర్వహిస్తున్నాయి! వామపక్షపార్టీలు చెప్పేవి వర్గ రాజకీయాలు (మార్క్సిజం), చేసే వి కుల రాజకీయాలు (మనువాదం) అనడానికి ఇంతకన్నా ఇంకేమి రుజువు కావాలి?
మార్క్సిస్ట్ విశ్లేషణకు శ్రమ, ఉత్పత్తి శక్తులు, ఉత్పత్తి సంబంధాలు అనేవి ప్రాథమిక అంశాలు. మరి ఈ దేశంలో శ్రమ ఎవరిది? అంటే ఏ కులాలది? ఉత్పత్తి సాధనాలు ఏ కులాల చేతిలో ఉన్నాయి? ఉత్పత్తి ఏ కులాల స్వంతం? భారతీయ సమాజంలో శ్రామి క కులాలు, శ్రమ దోపిడీకులాల విభజనలో సమస్యేమిటి? సమస్యలేదు. నిజానికి స్పష్టత ఉంది.
1919లోనే ప్రాచ్య జాతుల గురించి లెనిన్ ఏమి చెప్పారో చూడండి: 'తూర్పు జాతుల ప్రజల్లో అధిక సంఖ్యాకులు శ్రామిక ప్రజలకు సిసలైన ప్రతినిధులు. వీరు పెట్టుబడిదారీ ఫ్యాక్టరీలు అనే శిక్షణాలయాల్లో శిక్షణ పొందిన కార్మికులు కారు. కానీ మధ్యయుగాలనాటి పీడనకు గురి అవుతూ దోచుకోబడుతున్న శ్రామిక రైతు జన బాహుళ్యానికి సిసలైన ప్రతినిధులు.
జనాభాలో అత్యధిక భాగం రైతులుగా ఉండి, పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా కాకుండా, మధ్యయుగాల నాటి అవశేషాలకు వ్యతిరేకంగా పోరాటం సాగించటం కర్తవ్యంగా ఉన్న పరిస్థితులకు ఆ సార్వత్రక సిద్ధాంతాచరణను వర్తింపచేయాలి. అది కష్టసాధ్యమైన నిర్దిష్ట కర్తవ్యం. అయితే ధన్యవాదాలర్పించవలసిన కర్తవ్యం'.
లెనిన్ పేర్కొన్న రైతు జనబాహుళ్యం మనదేశంలోఎవరు? భూమిలేని, మానవ జీవిత హుందాకు నోచుకోని, ఊరికి దూరంగా ఉండే దళితులు కారా? కమ్యూనిస్టు నాయకులకు, మేధావులకు ఒక విజ్ఞప్తి: మనం కలిసి కదిలిన రోజు, అమాయకంగా ప్రాణాలు కోల్పోతున్న పోలీసు, పారామిలిటరీ దళాలు, దారి తప్పిన సల్వాజుడుం తమ మూల వాసుల మూలాల్లోకి వెళ్ళి ఈ దేశంలో అనాదిగా హతులౌతున్న మూల వాసుల రక్షణకై నిలబడతారు. ఇకనైనా ఎజెండా మార్చండి.
- ఎమ్. ఎఫ్. గోపీనాథ్
(ఫూలే-అంబేద్కర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, ఖమ్మం)

Subscribe to:
Posts (Atom)